50 కోట్ల క్లబ్ లోకి దుల్ఖర్ సల్మాన్ ‘కురుప్’

ABN , First Publish Date - 2021-11-16T20:50:37+05:30 IST

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కురుప్’. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా ఈ ఆరు రోజుల్లోనూ దుల్ఖర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నమోదైంది.

50 కోట్ల క్లబ్ లోకి దుల్ఖర్ సల్మాన్ ‘కురుప్’

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కురుప్’. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా కేరళలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా ఈ ఆరు రోజుల్లోనూ దుల్ఖర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నమోదైంది. అప్పుడే ఈ సినిమా రూ. 50కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. 1984లో కేరళ లో జరిగిన లో సెన్సేషన్ మర్డర్ కేసు పై ఈ సినిమా రూపొందింది. రూ.8లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఫిల్మ్ రిప్రెజెంటేటివ్ ను హత్యచేసిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ ఇప్పటికీ కేరళ పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. అతడి కోసం 37 సంవత్సరాల నుంచి కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్ అన్వేషిస్తూనే ఉంది. ఆ పాత్రను దుల్ఖర్ సల్మాన్ అద్బుతంగా పోషించి రక్తికట్టించారు. వాస్తవ సంఘటనలతో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని.. మంచి డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్. దుల్ఖర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మాణం జరుపుకున్న ‘కురుప్’ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో హోరెత్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెంతగా వసూలు చేస్తుందో చూడాలి.   Updated Date - 2021-11-16T20:50:37+05:30 IST