‘ఆచార్య’ రవి ఇకలేరు

ABN , First Publish Date - 2021-12-29T23:41:47+05:30 IST

‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత ఆయన పేరు ఆచార్య రవిగా స్థిరపడిపోయింది. ఈ చిత్రంలో విఘ్నేష్‌ హీరోగా నటించారు. ఈయన ‘ఆనైత్తుక్కుం ఆశప్పడుం’, ‘డమ్మీ పట్టాసు’, హీరో విజయ్‌ నటించిన ‘షాజహాన్‌’, అరవింద్‌ స్వామి నటించిన..

‘ఆచార్య’ రవి ఇకలేరు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు ‘ఆచార్య’ రవి (కేఎస్.రవి) అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు లోనైన ఆయన మదురై మీనాక్షి మిషన్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్‌ చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. కాగా, ప్రముఖ దర్శకుడు బాలా వద్ద అసిస్టెంట్‌ డైరక్టరుగా పనిచేసిన ఆయన, తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 


‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత ఆయన పేరు ఆచార్య రవిగా స్థిరపడిపోయింది. ఈ చిత్రంలో విఘ్నేష్‌ హీరోగా నటించారు. ఈయన ‘ఆనైత్తుక్కుం ఆశప్పడుం’, ‘డమ్మీ పట్టాసు’, హీరో విజయ్‌ నటించిన ‘షాజహాన్‌’, అరవింద్‌ స్వామి నటించిన ‘ఎన్‌ శ్వాస కాట్రే’, ప్రభు నటించిన ‘ధర్మశీలన్‌’ వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2001లో వచ్చిన విజయ్‌ ‘షాజహాన్‌’ చిత్రం బాగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈయన సొంతూరు కాంచీపురం. ఆయన అంత్యక్రియలు సొంతూరులో నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-12-29T23:41:47+05:30 IST