‘ఇండియాలో అలాంటి పాత్రలకి స్టార్స్‌ని ఎంచుకుంటారు.. అలాంటి పిచ్చిపనులు వారు చేయరు’

ABN , First Publish Date - 2021-11-29T17:55:08+05:30 IST

సినిమాలో ఏదైనా క్యారెక్టర్ కోసం సరిపోయే నటుల కోసం ఆడిషన్స్ నిర్వహించడం మామూలే. కానీ స్టార్స్‌కి మాత్రం పాత్ర కోసం ఆడిషన్ అనేది సాధారణంగా జరగదు...

‘ఇండియాలో అలాంటి పాత్రలకి స్టార్స్‌ని ఎంచుకుంటారు.. అలాంటి పిచ్చిపనులు వారు చేయరు’

సినిమాలో ఏదైనా క్యారెక్టర్ కోసం సరిపోయే నటుల కోసం ఆడిషన్స్ నిర్వహించడం మామూలే. కానీ స్టార్స్‌కి మాత్రం పాత్ర కోసం ఆడిషన్ అనేది సాధారణంగా జరగదు. ఈ విషయంలో భారత చిత్ర పరిశ్రమలపై విమర్శలు చేశాడు భారతీయ మూలాలున్న హాలీవుడ్ నటుడు దారా సంధు.


యూకేలో స్టేజ్ షోస్‌‌తో కెరీర్ ప్రారంభించిన ఈ సంధు. ఇటీవలే జరిగిన 17వ జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు సాధించిన డైరెక్టర్ మైఖేల్ స్టైనర్ దర్శకత్వంలో వచ్చిన ‘అండ్ టుమారో వుయ్ విల్  బీ డెడ్’లో విలన్ రోల్‌తో మంచి పాపులారిటీ సాధించాడు ఈ 34 ఏళ్ల నటుడు. ఈ నటుడు తాజాగా ఇండియాలో సినిమా ఇండస్ట్రీల్లో ఉన్న ఆడిషన్స్‌పై విమర్శలు చేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘వెస్టర్న్ పరిశ్రమల్లో ఆ పాత్రకి సరిపోయే బెస్ట్ యాక్టర్‌ని ఎంచుకుంటారు. అలాంటి వాటి కోసం ఓ నటుడికి ప్రత్యేకంగా నెట్‌వర్క్ ఉండాల్సిన అవసరం లేదు. కథలోని అవసరాన్ని బట్టి అతని దగ్గరకే ఆ రోల్ వస్తుంది. నిజానికి అక్కడ ఓ సినిమాకి కథే హీరో. అందుకే సరిపోయే నటుడి కోసమే చూస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. సినిమాకి ఎదో ఉపయోగపడుతుందని, నటుడు ఫేమస్ అయినందున సరిపోని రోల్‌ని కూడా అతనికి ఆఫర్ చేస్తారు. ఫిల్మ్ మేకర్స్ అలా అనుకుంటారు కానీ భారతీయ ప్రేక్షకులు సైతం అలాంటి స్టార్ డమ్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేద’ ని చెప్పాడు.


అంతేకాకుండా..‘నేను వెస్టర్న్ ఇండస్ర్టీల్లో మూస పద్ధతిలో ఆడిషన్స్‌ని చూడలేదు. సహజంగానే ఏదైనా కథలో కొన్ని పాత్రల కోసం జాతిపరమైన అవసరాలు ఉంటాయి. దానికి మీరు సరిపోయేలా ఉండాలి. కానీ ఇంతకుముందు సినిమాలో అలాంటి పాత్రే చేసినప్పటికీ.. ఇండియాలో మాత్రం ఒకే పాత్రం సెలెక్షన్‌కి పదే పదే పిలుస్తారు. అలా అక్కడ ఒక్కసారి ఆడిషన్ చేసిన తర్వాత మళ్లీ పిలవరు. వారే ఈమేజినేషన్ చేసుకుంటార’ని తెలిపాడు.

Updated Date - 2021-11-29T17:55:08+05:30 IST