తమిళ నటుడు డానియల్‌ బాలాజీకి కరోనా

ABN , First Publish Date - 2021-05-15T04:11:11+05:30 IST

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. ‘చిరుత’, ‘సాంబ’ లాంటి పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న తమిళ నటుడు డానియల్‌....

తమిళ నటుడు డానియల్‌ బాలాజీకి కరోనా

రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. ‘చిరుత’, ‘సాంబ’ లాంటి పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న తమిళ నటుడు డానియల్‌ బాలాజీకి శుక్రవారం వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దాంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం డానియల్‌ బాలాజీ పలు తమిళ, తెలుగు చిత్రాలో నటిస్తున్నారు. 

Updated Date - 2021-05-15T04:11:11+05:30 IST