హాస్యనటుడు కాళిదాస్‌ మృతి

ABN , First Publish Date - 2021-08-14T15:32:29+05:30 IST

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్‌ హాస్యనటుడు కాళిదాస్‌ (65) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయగా, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు గుర్తించారు.

హాస్యనటుడు కాళిదాస్‌ మృతి

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్‌ హాస్యనటుడు కాళిదాస్‌ (65) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు పలు వైద్య పరీక్షలు చేయగా, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు గుర్తించారు. దీంతో శరీరంలో రక్త మార్పిడి చేయాలనే వైద్యుల సలహా మేరకు కాళిదాస్‌కు రక్తమార్పిడి కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కన్ను మూశారు. ఈయన భార్య గతంలోనే మరణించగా.. ఒక కుమారుడు, ఒక కుమా ర్తె ఉన్నారు. నటుడు కాళిదాస్‌ అంత్యక్రియలు కూడా శుక్రవారం ముగిశాయి. ఆయన ఒకప్పుడు స్టార్‌ కమెడియన్‌ వడివేలుతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు, హాస్య నటులు తమ సంతాపాన్ని తెలిపారు. హాస్యనటుడుగా రాణించిన కాళిదాస్‌ దాదాపు రెండు వేలకు పైగా చిత్రాలకు డబ్బింగ్‌ కళాకారుడుగా పనిచేశారు. ఈయన ఎక్కువగా పోలీస్‌ పాత్రలే ధరించారు.

Updated Date - 2021-08-14T15:32:29+05:30 IST