30 నుండి చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ABN , First Publish Date - 2021-12-29T03:31:59+05:30 IST

ప్రతి యేటా చెన్నై మహానగరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతుంది. ఈ యేడాది కూడా తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈనెల 30వ తేదీ నుంచి డాక్టర్‌ కలైంజర్‌ 19వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఇండో సినీ

30 నుండి చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

ప్రతి యేటా చెన్నై మహానగరంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతుంది. ఈ యేడాది కూడా తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈనెల 30వ తేదీ నుంచి డాక్టర్‌ కలైంజర్‌ 19వ చెన్నై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఇండో సినీ అప్రిసియేషన్‌ నిర్వహించనుంది. గత రెండేళ్ళుగా కరోనా వైరస్‌ కారణంగా నామమాత్రంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ దఫా ప్రభుత్వ సహకారంతో పాటు నిధులు సమకూర్చడంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది. ఈ చిత్రోత్సవంలో భాగంగా సత్యం, పీవీఆర్‌, ఎస్డీసీ అన్నా సినిమా థియేటర్లలో ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు. మొత్తం 60 దేశాలకు చెందిన వందకు పైగా చిత్రాలు ప్రదర్శనకు నోచుకోనున్నాయి. తమిళచిత్రాలకు సంబంధించి ఉత్తమ చిత్రం, రెండో ఉత్తమ చిత్రం, స్పెషల్‌ జ్యూరీ అవార్డు కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ‘ఐందు ఉణర్వుగల్‌’, ‘భూమిక’, ‘కర్ణన్‌’, ‘కట్టిల్‌’, ‘మారా’, ‘తేన్‌’ తదితర చిత్రాలను ఎంపిక చేశారు.

Updated Date - 2021-12-29T03:31:59+05:30 IST