Chekwume Malvin : డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన నటుడు

ABN , First Publish Date - 2021-09-30T17:15:02+05:30 IST

తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన 'సింగం' సినిమాలో విలన్‌‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు

Chekwume Malvin : డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన నటుడు

తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన 'సింగం' సినిమాలో విలన్‌‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్‌‌ను చాక్విమ్మాల్విన్‌ విక్రయించేవాడని సమాచారం. అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఎన్నేళ్ళ నుంచి ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? ఇందులో ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు ఎవరైనా ఉన్నారా.. అన్న కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. కాగా చాక్‌‌విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించాడు. తమిళ్ లో 'సింగం', 'విశ్వరూపం' సినిమాలలో నటించాడు.

Updated Date - 2021-09-30T17:15:02+05:30 IST