సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హీరో VIJAY ఇంటికి బాంబు బెదిరింపు.... పోలీసుల ఊరుకులు, పరుగులు... ఇంతకీ, కాల్ చేసింది ఎవరంటే?

ABN, First Publish Date - 2021-11-16T23:19:38+05:30

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు ఉందంటూ, ఓ వ్యక్తి నేరుగా చైన్న నగర పోలీస్ కంట్రోల్ రూముకే కాల్ చేయటం, కలకలం రేపింది. పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌తో సహా ఇళయదళపతి ఇంటికే చేరుకున్నారు. గంటల తరబడి సోదాలు చేసినా కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు ఉందంటూ, ఓ వ్యక్తి నేరుగా చైన్న నగర పోలీస్ కంట్రోల్ రూముకే కాల్ చేయటం, కలకలం రేపింది. పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌తో సహా ఇళయదళపతి ఇంటికే చేరుకున్నారు. గంటల తరబడి సోదాలు చేసినా కూడా ఎక్కడా బాంబు జాడ కనిపించలేదు. దాంతో తమకు వచ్చింది ఫేక్ కాల్ అని గ్రహించిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్‌కి, అతడి కుటుంబానికి ఎలాంటి ప్రమాదం లేకపోవటంతో ఆయన ఇంటి నుంచీ వెనుదిరిగారు. కానీ, ఇంతకీ ఆ ఫేక్ కాల్ చేసిన అజ్ఞాతవ్యక్తి ఎవరు? ఫోన్ నంబర్ ఆధారంగా ఖాకీలు అతడ్ని వెదికి పట్టుకున్నారు!


హీరో విజయ్ ఇంట్లో బాంబు ఉందని చెప్పిన భువనేశ్వర్ తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరక్కణం గ్రామానికి చెందిన వాడట. అతను గతంలోనూ పలువురు ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టినట్టు ఫేక్ కాల్స్ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. కాకపోతే, విజయ్ ఇంట్లో బాంబు ఉందని చెప్పిన భువనేశ్వర్ మతిస్థిమితం లేని వాడు కావటంతో ఖాకీలు కూడా అతడి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపించటం లేదు. ఇంతకు ముందు ఇలాగే మరో కోలీవుడ్ స్టార్ అజిత్ ఇంట్లో బాంబు ఉందని దినేశ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అది కూడా ఒట్టిదేనని తేలింది. కాకపోతే, అప్పుడు దినేశ్ కూడా మతిస్థిమితం లేనివాడని తేలటంతో అతడికి ఫోన్ ఇవ్వద్దని తల్లిదండ్రుల్ని హెచ్చరించారు పోలీసులు. ఇప్పుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కేసులోనూ అలాగే జరిగే అస్కారం ఉంది...    

Updated Date - 2021-11-16T23:19:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!