జూలైలో 'బీస్ట్' కొత్త షెడ్యూల్ ..!

ABN , First Publish Date - 2021-06-23T16:22:39+05:30 IST

జూలై మొదటి వారం నుంచి 'బీస్ట్' మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్‌ స్టార్ ఇళయదళపతి విజయ్‌ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫస్ట్ షెడ్యూల్ ఈజిప్టులో పూర్తి చేశారు. చెన్నైలో లాక్ డౌన్ నిబంధనలు విడతలవారిగా సడలిస్తున్నారు.

జూలైలో 'బీస్ట్' కొత్త షెడ్యూల్ ..!

జూలై మొదటి వారం నుంచి 'బీస్ట్' మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్‌ స్టార్ ఇళయదళపతి విజయ్‌ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫస్ట్ షెడ్యూల్ ఈజిప్టులో పూర్తి చేశారు. చెన్నైలో లాక్ డౌన్ నిబంధనలు విడతలవారిగా సడలిస్తున్నారు. ఈ నెలాఖరుకు వరకు పూర్తిగా ఆంక్షలు ఎత్తివేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'బీస్ట్' కొత్త షెడ్యూల్‌కి సంబంధించిన ప్లాన్ చేస్తోందట చిత్ర బృందం. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చెన్నైలో భారీ సెట్ నిర్మాణం కూడ జరుగుతోందట. ఈ కొత్త షెడ్యూల్‌లో పూజా హెగ్డే కూడ జాయిన్ కానుందని తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్త సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2021-06-23T16:22:39+05:30 IST