సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆరు గెటప్స్‌లో అరవింద స్వామి.. త్వరలోనే రిలీజ్

ABN, First Publish Date - 2021-08-14T22:46:09+05:30

సెల్వా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వణంగాముడి’. అరవింద్‌ స్వామి, రితికా సింగ్‌, సిమ్రన్‌, చాందిని, తంబి రామయ్య, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. మేజిక్‌ బాక్స్‌ ఫిలిమ్స్‌ పతాకంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెల్వా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వణంగాముడి’. అరవింద్‌ స్వామి, రితికా సింగ్‌, సిమ్రన్‌, చాందిని, తంబి రామయ్య, జయప్రకాష్‌ తదితరులు నటిస్తున్నారు. మేజిక్‌ బాక్స్‌ ఫిలిమ్స్‌ పతాకంపై గణేష్‌ రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ చేశారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఈయన అరవింద్‌ స్వామేనా? అని ఆశ్చర్యపోయేలా వివిధ గెటప్స్‌ల్లో కనిపించారు. 


ఈ చిత్ర కథ గురించి దర్శకుడు సెల్వా మాట్లాడుతూ.. ఇది పోలీస్‌ స్టోరీ. సాధారణ పోలీస్‌ కథలకు భిన్నంగా రూపొందిస్తున్నాం. ముఖ్యంగా తన తెలివితేటలను ఉపయోగించి నేరస్థులను పోలీస్‌ అధికారి ఏ విధంగా గుర్తించారు. ఆ పోలీస్‌ అధికారి జీవితానికి, ఈ కేసుకు ఏమిటి సంబంధం అనే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం. ఇందులో అరవింద్‌ స్వామి ఆరు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆయన ఇప్పటివరకు నటించిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగాను, ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉందని, ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. 



Updated Date - 2021-08-14T22:46:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!