గూఢచారిగా అరుణ్‌ విజయ్‌

ABN , First Publish Date - 2021-05-15T22:32:45+05:30 IST

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌ తనయుడు అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బార్డర్‌’. అరివళగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను గత నెలలో విడుదల చేశారు. రెజీనా కాసాండ్రా, స్టెఫీ పటేల్‌ హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి, తీవ్రవాదం

గూఢచారిగా అరుణ్‌ విజయ్‌

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌ తనయుడు అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘బార్డర్‌’. అరివళగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను గత నెలలో విడుదల చేశారు. రెజీనా కాసాండ్రా, స్టెఫీ పటేల్‌ హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి, తీవ్రవాదం అనే రెండు అంశాలను ప్రధానాంశాలుగా చేసుకుని దర్శకుడు అరివళగన్‌ ‘బార్డర్‌’ను యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కించారు. ఇందులో అరుణ్‌ విజయ్‌, రెజీనా కెసాండ్రా.. గూఢచారులుగా కనిపించనున్నారు. అంతేకాదు అరుణ్ విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఈ సినిమాతో ఆయనకు స్టార్ స్టేటస్ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. 


‘కుట్రం-23’ వంటి సూపర్‌హిట్‌ మూవీని అందించిన అరివళగన్‌ - అరుణ్ విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ‘బార్డర్‌’పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా రాజశేఖర్‌ పనిచేయగా, సబు జోసెఫ్‌ ఎడిటింగ్‌ పనులు నిర్వహించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. 

Updated Date - 2021-05-15T22:32:45+05:30 IST