Puneeth Rajkumar కోసం... రోజుకు 30 వేల మంది!

ABN , First Publish Date - 2021-11-09T02:30:27+05:30 IST

ఈ మధ్యే చనిపోయిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద, కర్ణాటక రాష్ట్ర అదనపు పోలీసు బలగలతో పాటూ బెంగుళూరు పోలీసులు కూడా, వందలాది సంఖ్యలో నిత్యం పహారా కాస్తున్నారు. దాదాపు మూడు వందల మంది పోలీసులు కంఠీరవ స్టూడియోస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు...

Puneeth Rajkumar కోసం... రోజుకు 30 వేల మంది!

ఈ మధ్యే చనిపోయిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద, కర్ణాటక రాష్ట్ర అదనపు పోలీసు బలగలతో పాటూ బెంగుళూరు పోలీసులు కూడా, వందలాది సంఖ్యలో నిత్యం పహారా కాస్తున్నారు. దాదాపు మూడు వందల మంది పోలీసులు కంఠీరవ స్టూడియోస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంతగా భద్రత ఏర్పాటు చేయటానికి కారణం దివంగత నటుడి కోసం వెల్లువెత్తుతోన్న అభిమానమే!


46 ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, ఆయన అకాల మరణం శాండల్‌వుడ్ పవర్ స్టార్ అభిమానులకి ఇంకా శోకాన్ని కలిగిస్తూనే ఉంది. దాంతో ప్రతీ రోజూ భారీగా పునీత్ సమాధి వద్దకి జనం తరలి వస్తున్నారు. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో ఆయనని సమాధి చేశారు. అక్కడికి నిత్యం సగటున 30 వేల మంది వరకూ వస్తున్నట్టు అధికారుల అంచన. అందుకే, వందలాది మందితో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది... 

Updated Date - 2021-11-09T02:30:27+05:30 IST