బికినీ ఫొటో అడిగిన నెటిజన్.. దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన anupama parameswaran!
ABN , First Publish Date - 2021-10-01T17:59:42+05:30 IST
గ్లామర్ పాత్రలకు దూరంగా కాస్త సాంప్రదాయమైన పాత్రల్లోనే నటించి మెప్పించింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్.

గ్లామర్ పాత్రలకు దూరంగా కాస్త సాంప్రదాయమైన పాత్రల్లోనే నటించి మెప్పించింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. హద్దులు దాటి ఎప్పుడూ ఆమె అంగాంగ ప్రదర్శన చేయలేదు. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇటీవల తెలుగులో ఆమెకు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ మలయాళంలో మాత్రం ఆమె ఆఫర్లు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా అభిమానులతో ముచ్చటించింది.
అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమాధానాలు చెప్పింది. `తెలుగులో చేస్తున్న సినిమాలు ఏంటి?`, `కొత్తగా ఏయే సినిమాలు అంగీకరించారు?`, `మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం?` వంటి ప్రశ్నలనే చాలా మంది అడిగారు. వాటికి అనుపమ ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ మాత్రం అనుపమకు చిరాకు తెప్పించాడు. బికినీలో ఉన్న ఫోటోను షేర్ చెయ్యమని అడిగేశాడు. దీనికి అనుపమ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. `నీ అడ్రస్ పంపు.. నేను ఫోటో పంపుతా.. మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకో` అని రిప్లై ఇచ్చింది.
