బాలు మహేంద్రన్ స్కూల్ నుంచి మరో దర్శకుడు
ABN , First Publish Date - 2021-08-09T15:05:52+05:30 IST
దర్శకుడు బాలా, వెట్రిమారన్ వరుసలో దర్శక దిగ్గజం బాలు మహేంద్రన్ స్కూల్ నుంచి మరో దర్శకుడు కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఈయన పేరు ఆర్.బి. సాయి. ఈయన దర్శకత్వం వహించే చిత్రానికి 'ముదల్ ముత్తమే ఇరుది ముత్తం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

దర్శకుడు బాలా, వెట్రిమారన్ వరుసలో దర్శక దిగ్గజం బాలు మహేంద్రన్ స్కూల్ నుంచి మరో దర్శకుడు కోలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఈయన పేరు ఆర్.బి. సాయి. ఈయన దర్శకత్వం వహించే చిత్రానికి 'ముదల్ ముత్తమే ఇరుది ముత్తం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జేసీ మీడియా బ్యానర్‌లో వసంత్ కుమార్ పిళ్ళై, మురళి కృష్ణలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరికాంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌రామ్ సంగీతం అందిస్తున్నారు.
విష్ణుప్రియన్, మేగ్నా ఎలన్ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్యామ్ ఆండర్సన్, రోహిత్ బాలయ్య, ఎస్.గౌతమ్, జూనియర్ టీఆర్ తదితరులు ఇత్ర ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ఆర్.బి.సాయ్ మాట్లాడుతూ, "తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధం, ప్రేమను ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కోయంబత్తూరులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని కోవై, పొల్లాచ్చి తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం." అని తెలిపారు.