డబ్బింగ్ పనుల్లో 'అణ్ణాత్త'
ABN , First Publish Date - 2021-08-05T17:10:06+05:30 IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ - మాస్ చిత్రాల దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అణ్ణాత్త'. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, కొంతభాగం చెన్నైలోనూ పూర్తి చేశారు. ఇందులో రజనీకాంత్‌తో పాటు కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, నయనతార, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి నటిస్తున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ - మాస్ చిత్రాల దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అణ్ణాత్త'. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ, కొంతభాగం చెన్నైలోనూ పూర్తి చేశారు. ఇందులో రజనీకాంత్‌తో పాటు కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, నయనతార, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు. అయితే, ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రజనీకాంత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఇపుడు మీనా డబ్బింగ్ చెప్పారు. మీనా తర్వాత ఖుష్బూ, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, సూరి తమతమ పాత్రలకు డబ్బింగ్ చెప్పనున్నారు. కాగా ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబరు 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.