అనసూయ మలయాళ మూవీ వచ్చేది అప్పుడే

ABN , First Publish Date - 2021-12-29T19:40:23+05:30 IST

ఇటు బుల్లితెరపై క్రేజీ యాంకర్ గానూ, అటు వెండితెరపై ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ సత్తా చాటుకుంటోంది అనసూయ భరద్వాజ్. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి అనే గ్రేషెడ్స్ కలిగిన పాత్ర పోషించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది అనసూయ. అందులోని ఆమె డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మెప్పించాయి. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తున్న అనసూయ.. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రంలో అనసూయ నటిస్తుండగా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ పీరియాడికల్ చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.

అనసూయ మలయాళ మూవీ వచ్చేది అప్పుడే

ఇటు బుల్లితెరపై క్రేజీ యాంకర్ గానూ, అటు వెండితెరపై ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ సత్తా చాటుకుంటోంది అనసూయ భరద్వాజ్. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి అనే గ్రేషెడ్స్ కలిగిన పాత్ర పోషించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది అనసూయ. అందులోని ఆమె డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మెప్పించాయి. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటిస్తున్న అనసూయ.. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రంలో అనసూయ నటిస్తుండగా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ పీరియాడికల్ చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో ఆమె పేరు ఆలిస్. అమల్ నీరద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆమెకిది తొలి చిత్రం. ఈ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 


ఫోర్ట్ కొచ్చీలో మెరైన్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న భీష్మ వర్ధన్..  గతంలో పెద్ద గ్యాంగ్‌స్టర్. అతడు తన గత జీవితాన్ని వదలిపెట్టినా శత్రువులు అతడ్ని, అతడి ఫ్యామిలీని వెంటాడుతునే ఉంటారు. దాంతో తన కుటుంబ సభ్యుల్ని రక్షించుకోడానికి అతడు మళ్ళీ గ్యాంగ్ స్టర్ గా భీష్మ పర్వాన్ని మొదలు పెట్టడమే ఈ సినిమా కథాంశం. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, షైన్ టామ్ చాకో, జిను జోసెఫ్, దిలీష్ పోత్తన్, లినా, నదియా, అంజలి, సుదేవ్ నాయర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అమల్ నీరద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.  Updated Date - 2021-12-29T19:40:23+05:30 IST