సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమలాపాల్ ఇప్పుడు గ్లోబల్ సిటిజెన్

ABN, First Publish Date - 2021-12-30T15:44:13+05:30

సౌత్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అమలాపాల్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే టాలెంట్ ఆమె సొంతం. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో సత్తా చాటుకోడానికి ఆమె ఎప్పుడూ సిద్ధమే. అలాంటి ఆమె ఇప్పుడో అరుదైన గౌరవం పొందింది. ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ గవర్నమెంట్ చేతుల మీదుగా గోల్డెన్ వీసా పొందింది. ఇటీవలే మెగా కోడలు ఉపాసన కొణిదెల గోల్డెన్ వీసా పొందిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్‌లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అమలాపాల్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే టాలెంట్ ఆమె సొంతం. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో సత్తా చాటుకోడానికి ఆమె ఎప్పుడూ సిద్ధమే. అలాంటి ఆమె ఇప్పుడో అరుదైన గౌరవం పొందింది. ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ గవర్నమెంట్ చేతుల మీదుగా గోల్డెన్ వీసా పొందింది. ఇటీవలే మెగా కోడలు ఉపాసన కొణిదెల గోల్డెన్ వీసా పొందిన సంగతి తెలిసిందే. గతంలో ఈ గౌరవాన్ని పొందిన వారిలో మమ్ముట్టి, మోహన్ లాల్, టోవినో థామస్, పార్తిబన్, త్రిష కృష్ణన్ లాంటి ప్రముఖులున్నారు. ఇప్పుడు అమలాపాల్ కు ఈ విశిష్ట గౌరవం దక్కడంతో తన ఇన్ స్టా ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


‘వారు గోల్డ్ గా వెళ్ళమన్నారు. నేను గోల్డ్ కోసం వెళ్ళాను. ఈ రోజు యూఏఈ గోల్డెన్ వీసాను పొందాను. ఇదొక అద్భుతంగా ఫీలవుతున్నాను. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని  అమలా పాల్ తెలిపారు. ప్రస్తుతం ‘కెడావర్, అదో అంద పరవైపోలా’ తమిళ చిత్రాల్లో ప్రధాన పాత్రలు చేస్తున్న అమలా పాల్.. ‘ఆడుజీవితం’ మలయాళ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.  



Updated Date - 2021-12-30T15:44:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!