Sai Pallavi షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!
ABN , First Publish Date - 2021-10-04T21:23:42+05:30 IST
సాయిపల్లవి.. భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న హీరోయిన్.

సాయిపల్లవి.. భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న హీరోయిన్. ఈమె డాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డాన్స్ మాత్రమే కాదు.. సాయి పల్లవి నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత ప్రజాదరణ ఉన్నప్పటికీ సాయిపల్లవి ఇతర హీరోయిన్ల మాదిరిగా కనిపించదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయదు. కథ తనకు నచ్చితేనే ఓకే చెబుతుంది. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాకైనా `నో` చెప్పేస్తుంది.
సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరీ` సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా సాయిపల్లవి నటన, డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సాయి పల్లవి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుందట. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేందుకు డాక్టర్ వృత్తిని చేపట్టాలని భావిస్తోందట. జార్జియాలో సాయి పల్లవి ఎమ్‌బీబీఎస్ చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల తన విద్యను వృథాగా పోనీయకుండా డాక్టరుగా మారాలనుకుంటోందట. అంతమాత్రాన ఆమె అభిమానులు నిరాశ చెందనక్కర్లేదు. డాక్టర్ వృత్తిలో కొనసాగుతూనే.. మంచి కథ ఉన్న చిత్రాల్లో నటిస్తానని పల్లవి తెలిపింది. ఈ నేపథ్యంలో ఇకపై సాయిపల్లవి సినిమాలు తగ్గుతాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు.