ఆదిత్య జయన్ ఆత్మహత్యాయత్నం..
ABN, First Publish Date - 2021-04-27T17:46:11+05:30
మలయాళ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య జయన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న ఆదిత్య జయన్.. తన చేతి నరాలు కట్ చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో వెంటనే ఆదిత్య జయన్‌ని త్రిచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మలయాళ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య జయన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న ఆదిత్య జయన్.. తన చేతి నరాలు కట్ చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో వెంటనే ఆదిత్య జయన్‌ని త్రిచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందున్నాడు. ఇక మణికట్టును కోసుకోవడానికి ముందు ఆదిత్య జయన్ అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.
సీరియల్ నటి అంబిలి దేవి.. తన భర్త ఆదిత్య జయన్ మీద ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను మోసం చేశాడంటూ ఇటీవలే అంబిలి దేవి మీడియా ముందు వెల్లడించింది. ఇదే సమయంలో ఆదిత్య తనకు విడాకులివ్వామంటూ బలవంతపెడుతున్నాడని.. చంపేందుకు వెనకాడనంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. కాగా భార్య అంబిలి దేవి.. తన మీద చేసిన ఆరోపణలు అవాస్తమంటూ ఆదిత్య జయన్ ఖండించాడు. కావాలనే తన పరు తీయాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే ఆదిత్య జయన్ సూసైడ్‌కు ప్రయత్నించడం సంచలనంగా మారింది. 2019లో ఆదిత్య జయన్, అంబిలి దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.