బెస్ట్ యాక్టర్ Dhanush : అదే సినిమా... మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్!

ABN , First Publish Date - 2021-11-29T21:43:58+05:30 IST

తమిళ స్టార్ హీరో ధనుష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన ‘అసురన్’ సినిమాకిగాను మరోసారి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు...

బెస్ట్ యాక్టర్ Dhanush : అదే సినిమా... మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్!

తమిళ స్టార్ హీరో ధనుష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన ‘అసురన్’ సినిమాకిగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’తో పాటూ ‘బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ కూడా నిర్వహించటం జరిగింది. అందులో ఉత్తమ నటుడిగా ధనుష్ పురస్కారం దక్కించుకున్నాడు. 


బ్రిక్స్ అంటే... బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల కూటమి. అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన ‘బ్రిక్స్’ తాము ఏటా నిర్వహించే ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఈ సారి గోవాలో జరిపింది. అందులో తమ సినిమా ‘అసురన్’కిగానూ ఉత్తమ నటుడు అవార్డ్ లభించినట్టు ధనుష్ ట్విట్టర్‌లో తెలిపాడు. ‘‘ఇదొక అత్యుత్తమ గౌరవం’’ అని ఆయన పేర్కొన్నాడు. గతంలో, ‘అసురన్’ సినిమాకే ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కూడా పొందిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు అదే చిత్రానికిగానూ ‘బ్రిక్స్’ అంతర్జాతీయ అవార్డ్ లభించటం విశేషమనే చెప్పాలి...   

Updated Date - 2021-11-29T21:43:58+05:30 IST