Mammootty : ‘సి.బీ.ఐ’ సిరీస్ లో 5వ చిత్రం రాబోతోంది!
ABN , First Publish Date - 2021-11-09T16:43:08+05:30 IST
పోలీస్ చిత్రాలకు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు మలయాళ పరిశ్రమ పెట్టింది పేరని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పక్కా డీటెయిలింగ్ తో, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో, ఆసక్తికరమైన సన్నివేశాలతో గతంలో విడుదలైన పలు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. ఈ క్రమంలో గతంలో మాలీవుడ్ లో మమ్ముట్టి కథానాయకుడిగా కె.మధు దర్శకత్వంలో సి.బీ.ఐ ఇన్వెస్టిగేటివ్ ధ్రిల్లర్స్ నాలుగు విడుదలయ్యాయి.

పోలీస్ చిత్రాలకు, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కు మలయాళ పరిశ్రమ పెట్టింది పేరని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పక్కా డీటెయిలింగ్ తో, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో, ఆసక్తికరమైన సన్నివేశాలతో గతంలో విడుదలైన పలు చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. ఈ క్రమంలో గతంలో మాలీవుడ్ లో మమ్ముట్టి కథానాయకుడిగా కె.మధు దర్శకత్వంలో సి.బీ.ఐ ఇన్వెస్టిగేటివ్ ధ్రిల్లర్స్ నాలుగు విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ‘ఒరు సి.బీ.ఐ డైరీ కురిప్పు, జాగ్రత్త, సేతురామయ్యర్ సి.బీ.ఐ’, నేరరియాన్ సి.బీ.ఐ’ అనే ఈ నాలుగు సినిమాల్లో ఒక మర్డర్ కేసు జరగడం.. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సేతరామయ్యర్ (మమ్ముట్టి ) రంగంలోకి దిగి. కేస్ సాల్వ్ చేయడం కనిపిస్తుంది. ఈ సిరీస్ లో ఆఖరి సినిమా ‘నేరరియాన్ సిబీఐ’ 2005లో విడుదలవగా.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఐదో భాగం రానుండడం విశేషం. వీటిలో ‘ఒరు సిబీఐ డైరీ కురిప్పు’ అప్పట్లో ‘సీబీఐ డైరీ’ గా తెలుగులో అనువాదమైంది. అలాగే రాజశేఖర్ హీరోగా ‘న్యాయం కోసం’ గా రీమేక్ అయ్యింది కూడా.
ఇప్పుడు ఈ సిరీస్ లో 5వ సినిమాకి సమయం ఆసన్నమైంది. ‘సి.బీ.ఐ 5’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కె. మధు దర్శకత్వంలో, యస్.యన్. స్వామి స్ర్కిప్ట్ తో ఈ సినిమా డిసెంబర్ లో షూట్ కు వెళ్ళబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కరోనా కారణంగా ఇంత టైమ్ పట్టింది. ఇతర కేస్టింగ్, టెక్నికల్ టీమ్ ను త్వరలోనే ప్రకటిస్తారు. ఇక ఈ సిరీస్ లోని సినిమాలన్నటికీ జేమ్స్ బాండ్ తరహాలో ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది. అది ఈ సినిమాలకే హైలైట్ గా నిలిచిపోయింది. ఐదో చిత్రానికి కూడా అదే థీమ్ మ్యూజిక్ కంటిన్యూ కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రజాదరణ దక్కించుకుంటుందో చూడాలి.