సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జూలై 9న ‘ఆహా‌’లో విడుదలవుతున్న చిత్రాలివే

ABN, First Publish Date - 2021-07-09T00:28:03+05:30

గ‌త‌వారం ప‌దిహేను చిత్రాల‌తో సంద‌డి చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ఈ జూలై 9న మరో రెండు చిత్రాలను వదులుతోంది. అందులో ఒకటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఒక చిన్న విరామం’ కాగా, రెండోది యాక్ష‌న్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ‌త‌వారం ప‌దిహేను చిత్రాల‌తో సంద‌డి చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ఈ జూలై 9న మరో రెండు చిత్రాలను వదులుతోంది. అందులో ఒకటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఒక చిన్న విరామం’ కాగా, రెండోది యాక్ష‌న్ డ్రామా ‘విక్ర‌మార్కుడు’. ‘ఒక చిన్న విరామం’ సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. పున‌ర్న‌వి భూపాలం, గ‌రిమ‌, న‌వీన్ నేని ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ‘ఒక చిన్న విరామం’ సినిమా సుదీప్ చెగూరి ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందింది. ఇక 'విక్రమార్కుడు' విషయానికి వస్తే త‌మిళంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ డ్రామా జుంగ‌ను తెలుగులో ఈ టైటిల్‌తో 'ఆహా' అందిస్తోంది. విజ‌య్ సేతుప‌తితో పాటు స‌యేషా, మ‌డొన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది.


రీసెంట్‌గా ‘సూప‌ర్‌హిట్స్’ అనే క్యాంపెయిన్‌ను ఆహా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రేక్ష‌కులు త‌మ అభిమాన తార‌లు న‌టించిన త‌మ ఫేవ‌రేట్ చిత్రాలు, వెబ్ ఒరిజిన‌ల్స్‌ను చూడ‌టం ద్వారా అభిమానాన్ని సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకుంటారు. కార్తి నుంచి ర‌వితేజ, స‌మంత‌, త‌మ‌న్నా, అల్ల‌రి న‌రేశ్‌, ఫ‌హాద్ ఫాజిల్ త‌దిత‌రులు కెరీర్ బెస్ట్ ఫెర్ఫామెన్స్ చేసిన చిత్రాలను అలాగే వెబ్ సిరీస్‌లను ‘ఆహా’లో ఎంజాయ్ చేయ‌వ‌చ్చంటూ ఈ క్యాంపెయిన్‌లో ప్రకటిస్తున్నారు.

Updated Date - 2021-07-09T00:28:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!