సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘జీ 5’లో ‘రాజ రాజ చోర’.. దోచేస్తున్నాడు

ABN, First Publish Date - 2021-10-15T04:14:38+05:30

‘జీ 5’లో ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ నిజంగానే ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. శ్రీవిష్ణు, సునైనా, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా హసిత్ గోలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘జీ 5’లో ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ నిజంగానే ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. శ్రీవిష్ణు, సునైనా, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా హసిత్ గోలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని, ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి ‘జీ 5’ కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం చూడమని ప్రజలకు చెప్పారు. 


కుటుంబ సభ్యులతో ఈ సినిమా చూడమని దర్శకుడు శ్రీవాస్ కోరితే... సీనియర్ రచయిత గోపి మోహన్ ఈ సినిమా ఒక ‘జెమ్’ అని అభివర్ణించారు. రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఓ బేబీ’ దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో ‘మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్ తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది’ అన్నారు. ‘రాజ రాజ చోర’ బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు. సినీ ప్రముఖులే కాదు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుండి డిజిటల్ మీడియా వరకు... ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే ‘రాజ రాజ చోర’ ప్రజలు మనసులు ఎలా దోచేశాడో స్పష్టమవుతుంది. ‘జీ 5’లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్‌లో మరింత మంది చూసే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

Updated Date - 2021-10-15T04:14:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!