సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘తెల్ల‌వారితే గురువారం’.. ఓటీటీ విడుదలకు రెడీ

ABN, First Publish Date - 2021-04-15T21:51:25+05:30

మార్చి 27న వెండితెరపై విడుదలైన ‘తెల్ల‌వారితే గురువారం’ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి 27న వెండితెరపై విడుదలైన ‘తెల్ల‌వారితే గురువారం’ చిత్రం ఓటీటీలో  విడుదల కాబోతోంది. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ‘ఆహా’ ప్రసారం చేస్తుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రేమికులు విలాసవంతమైన ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేక్ పైనున్న చెర్రీ పండులా ఈ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది క్రాక్, నాంది, గాలి సంపత్, జాంబి రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘ఆహా’ ఉగాది సంబరాలను ప్రేక్షకులకు ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో ఈ వారాంతరంలోనూ అందించడానికి సిద్ధమైంది. వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా   ‘ఆహ’ తెలుగు ప్రేక్ష‌కుల మన్ననలు అందుకుంటోంది. ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్స్ నుంచి రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ వ‌ర‌కు.. అలాగే వెబ్ సిరీస్‌లు, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూస్ అన్నింటినీ ఓ గొడుగు కింద‌కు చేర్చి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది 


‘తెల్లవారితే గురువారం’ సినిమా విషయానికి వస్తే.. శ్రీసింహా, మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించారు. నేటి యువతలో చాలా మంది ఎదుర్కొంటున్న గందరగోళాలను తెరపై చూపెట్టే చిత్రమిది. ప్రేమ, బంధాలపై మరింత గౌరవాన్ని పెంపొందించేలా చేసే చిత్రమిది. మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలను తేలికగా అందరికీ అర్థమయ్యేలా కామెడీ కోణంలో వివరించే ప్రయత్నం చేశారీ సినిమాలో. అన్ని రకాల అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది. తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ‘తెల్లవారితే గురువారం’ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని ఆహా భావిస్తుంది. 

Updated Date - 2021-04-15T21:51:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!