డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘సీటీమార్’.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-10-09T03:34:50+05:30 IST
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విజయదశమి కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఇటీవల నితిన్, నభా నటేష్ నటించిన మ్యాస్ట్రో చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలైన విషయం తెలిసిందే.