ఆహాలో ‘రొమాంటిక్’ వచ్చేస్తోంది..
ABN , First Publish Date - 2021-11-17T13:42:57+05:30 IST
ఆహాలో ‘రొమాంటిక్’ మూవీ వచ్చేస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ నటించిన ఈ చిత్రానికి పూరి అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్,
ఆహాలో ‘రొమాంటిక్’ మూవీ వచ్చేస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ నటించిన ఈ చిత్రానికి పూరి అసోసియేట్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 29న థియేటర్లలో రిలీజైంది. కానీ, ఆశించిన సక్సెస్ అందుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజైన నాలుగు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో నవంబర్ 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.