సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓటీటీలో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2021-08-29T00:05:37+05:30

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనేలా వార్తలు గతకొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనేలా వార్తలు గతకొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌‌లో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఎప్పుడు? అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సెప్టెంబ‌ర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు డిస్నీహాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో హీరో నితిన్ న‌ల్ల‌టి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి చేతిలో క‌ర్ర ప‌ట్టుకుని న‌డుస్తున్నాడు. ఇక సినిమాలో న‌టిస్తోన్న ప్ర‌ధాన తారాగ‌ణమైన న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా, వి.కె.న‌రేశ్‌, జిస్సుసేన్ గుప్తా, త‌దిత‌రులు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.



Updated Date - 2021-08-29T00:05:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!