ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే!
ABN , First Publish Date - 2021-11-29T23:39:13+05:30 IST
ప్రతి శుక్రవారం థియేటర్లో సందడి చేసే సినిమాల సంఖ్య వారంవారం పెరుగుతోంది. కరోనాతో వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నాయి. ఓటీటీలోనూ అంతే! ఈ నెలలో విడుదలైన సినిమాలే అందుకు నిదర్శనం. వచ్చే నెల కూడా ఇదే హవా కొనసాగనుంది. డిసెంబర్ మొదటివారంలో అలరించే సినిమాలపై ఓ లుక్కేద్దాం..

ప్రతి శుక్రవారం థియేటర్లో సందడి చేసే సినిమాల సంఖ్య వారంవారం పెరుగుతోంది. కరోనాతో వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నాయి. ఓటీటీలోనూ అంతే! ఈ నెలలో విడుదలైన సినిమాలే అందుకు నిదర్శనం. వచ్చే నెల కూడా ఇదే హవా కొనసాగనుంది. డిసెంబర్ మొదటివారంలో అలరించే సినిమాలపై ఓ లుక్కేద్దాం..
‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల సక్సెస్ తర్వాత బాలకృష్ణ; బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘ఆఖండ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.
మోహన్‌లాల్ ‘మరక్కార్’.
మోహన్‌లాల్ కీలక పాత్రలో ప్రియదర్శన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మరక్కార్’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కరోనాతో లాక్డౌన్ విధించటంతో అప్పటి నుంచి ‘మరక్కార్’ వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వచ్చే నెల 3న సినిమాను విడుదల చేస్తున్నారు. అర్జున్, కీర్తిసురేశ్, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించారు.
స్కైల్యాబ్ భూమ్మీద దిగితే...
సత్యదేవ్, నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకుడు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు పూర్ణ నటించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం కూడా ఈ నెల 3న విడుదల కానుంది.
‘ఆర్ఎక్స్ 100’ హిందీలో..
టాలీవుడ్లో సూపర్‌హిట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’ను ‘తడప్’ టైటిల్‌తో బాలీవుడ్లో రీమేక్ చేశారు. సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తారా సుతారియా కథానాయికగా నటిస్తున్నారు. మిలాన్ లుతారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే...
నెట్‌ఫ్లిక్స్
డిసెంబరు 1
లాస్ ఇన్ స్పేస్ డిసెంబరు 1
ద పవర్ ఆఫ్ ది డాగ్(హాలీవుడ్) డిసెంబరు 1
కోబాల్ట్ బ్లూ(హాలీవుడ్) డిసెంబరు 3
మనీ హెయిస్ట్ 5
ఆహా
మంచి రోజులు వచ్చాయి (డిసెంబరు 3)
జీ5
బాబ్ విశ్వాస్(హిందీ) డిసెంబరు 3
అమెజాన్ ప్రైమ్
ఇన్ సైడ్ ఎడ్జ్ - డిసెంబరు 3