సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ఆహా’లో ఈ వారం డబుల్ బొనాంజా

ABN, First Publish Date - 2021-07-22T02:57:04+05:30

ప్ర‌తి వారాంతం ప్రేక్ష‌కుల‌కు తెలుగులో సరికొత్త కంటెంట్ అందించే ప్రయత్నంలో భాగంగా ‘ఆహా’ ఓటీటీ ఈ వారం ప్రేక్షకులకు డబుల్ బొనాంజాని అందివ్వబోతుంది. ఈ వారం ‘ఆహా’లో రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌తి వారాంతం ప్రేక్ష‌కుల‌కు తెలుగులో సరికొత్త కంటెంట్ అందించే ప్రయత్నంలో భాగంగా ‘ఆహా’ ఓటీటీ ఈ వారం ప్రేక్షకులకు డబుల్ బొనాంజాని అందివ్వబోతుంది. ఈ వారం ‘ఆహా’లో రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘నీడ‌, హీరో’ చిత్రాలు ‘ఆహా’లో విడుద‌ల‌కాబోతున్నాయి. ‘నీడ’ సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. న‌య‌న‌తార‌, కూన్‌చ‌కొ బొబ్బ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించారు. అప్పు ఎన్‌. భ‌ట్టాతిరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జూలై 23న ఈ చిత్రంలో `ఆహా`లో విడుద‌ల‌వుతుంది. ఇక రిషబ్ శెట్టి హీరోగా న‌టిస్తూ నిర్మించిన ‘హీరో’ చిత్రం జూలై 24న ‘ఆహా’లో విడుద‌ల‌వుతుంది. గ‌న‌వి ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌మోద్ శెట్టి, ఉగ్రం మంజు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ఎం భ‌ర‌త్‌రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యాక్ష‌న్‌, కామెడీ అంశాల మేళ‌వింపుతో రూపొందిన చిత్ర‌మిది. రీసెంట్‌గా ‘ఆహా’లో అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సై ఫై క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘కుడిఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-07-22T02:57:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!