నవీన్ చంద్ర, అవికాగోర్ అలా చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు కదా!
ABN , First Publish Date - 2021-11-27T00:30:58+05:30 IST
నవీన్ చంద్ర, అవికాగోర్ జంటగా సినిమా అనగానే అంతా.. వారిద్దరూ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారనే అనుకుంటారు. కానీ అలా అనుకున్నవారందరికీ వారిద్దరూ షాక్ ఇచ్చారు. వారిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం..
నవీన్ చంద్ర, అవికాగోర్ జంటగా సినిమా అనగానే అంతా.. వారిద్దరూ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారనే అనుకుంటారు. కానీ అలా అనుకున్నవారందరికీ వారిద్దరూ షాక్ ఇచ్చారు. వారిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం #బ్రో. సోని లివ్ ఓటీటీలో నవంబర్ 26న విడుదలైందీ చిత్రం. ఈ చిత్రంలో తన తరువాత పుట్టిన చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే అన్న పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. తన చెల్లెలిని అనారోగ్యం నుండి కాపాడుకునేందుకు దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించే పాత్రలో నటించిన నవీన్ చంద్ర నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. ఇందులో నవీన్ చంద్రకు చెల్లెలిగా అవికా గోర్ నటించింది.
అసలు వీరిద్దరూ ఇలా అన్నా, చెల్లెలిగా నటిస్తారని ఎవరూ ఊహించరు. నవీన్ చంద్రకి పోటీగా అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఈ చిత్రంలో ప్రదర్శించినట్లుగా టాక్ నడుస్తుంది. అన్నయ్యే తనకి అన్ని అని బ్రతికే చెల్లెలి పాత్రలో.. సినిమా చూస్తున్న అందరిచేత కన్నీళ్ళు పెట్టించేలా నటించిన అవికా గోర్పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక ఢిఫరెంట్ కథనాన్ని తెరకెక్కించిన దర్శకుడు కార్తిక్ తుపురానిని కూడా అంతా అభినందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జెజెఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జెజెఆర్ రవిచంద్ నిర్మించారు.