మంచు విష్ణు ‘చదరంగం’కు బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డ్

ABN , First Publish Date - 2021-05-15T04:12:20+05:30 IST

ఇండియాలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా మంచు విష్ణు నిర్మించిన ‘చదరంగం’ తెలుగు వెబ్ సిరీస్ అవార్డును దక్కించుకుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు. మంచు విష్ణు తన బ్యానర్‌లో నిర్మించిన మొట్టమొదటి వెబ్ సిరీస్

మంచు విష్ణు ‘చదరంగం’కు బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డ్

ఇండియాలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా మంచు విష్ణు నిర్మించిన ‘చదరంగం’ తెలుగు వెబ్ సిరీస్ అవార్డును దక్కించుకుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అనంత దర్శకత్వం వహించారు. మంచు విష్ణు తన బ్యానర్‌లో నిర్మించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ఇది. 2020, ఫిబ్రవరిలో జీ 5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ విడుదలై మంచి ఆదరణను పొందింది. ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్‌లో రాణించిన వాటిని గౌరవించాలని ఎక్ఛేంజ్ 4 మీడియా(ఇ4ఎమ్) గ్రూప్ స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్‌ను ఈ సంవత్సరం (2021) నుంచి ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌లో ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డును గెలుపొందింది. ఈ వెబ్ సిరీస్‌లో హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించగా.. చలపతిరావు, నాగినీడు, కౌసల్య, సునైనా తదితరులు ఇతర పాత్రలలో నటించారు.


ఇక ఈ అవార్డు రావడం పట్ల మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ గుర్తింపుకు ధన్యవాదాలు. శ్రీకాంత్‌గారు, డైరెక్టర్ రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్, ఇతర తారాగణం మరియు సాంకేతిక నిపుణులందరూ ఈ అవార్డుకు అర్హులు. మమ్మల్ని నమ్మినందుకు జీ5కు ధన్యవాదాలు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా ‘చదరంగం’ ఎంపికవడం చాలా గర్వకారణంగా ఉంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్న మంచు విష్ణు భవిష్యత్‌లో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌‌లను ప్రేక్షకులకు అందించేలా ఈ అవార్డు తమలో ఉత్తేజాన్ని నింపిందని తెలిపారు. 



Updated Date - 2021-05-15T04:12:20+05:30 IST