సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ఆహా’లో ‘సుల్తాన్’ సందడి మొదలవ్వబోతోంది

ABN, First Publish Date - 2021-04-28T01:15:44+05:30

బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోస్‌లతో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా పేరొందిన ‘ఆహా’ హౌస్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న హీరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోస్‌లతో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా పేరొందిన ‘ఆహా’ హౌస్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న హీరో కార్తి, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సుల్తాన్’ తెలుగు వెర్షన్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్ని అంశాల కలయికలో రూపొందిన ఈ చిత్రాన్ని భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించారు. ఈ చిత్రం రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సందడి చేసిన సంగతి తెలిసిందే. 


కార్తి హీరోగా నటించిన ‘ఖైది’ చిత్రం కూడా ‘ఆహా’లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ‘సుల్తాన్‘ చిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే రకమైన ఆసక్తిని రేకెత్తిస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వెబ్ షోస్, సక్సెస్‌ఫుల్ చిత్రాలతో పాటు  ఏప్రిల్ నెలలో లెవన్త్ అవర్, తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ సమ్మర్‌లో వేసవిని జయించేలా ఇళ్లలోకి థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను తీసుకొస్తామని హామీ ఇస్తోంది ‘ఆహా’.

Updated Date - 2021-04-28T01:15:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!