సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హసీన్‌ దిల్‌రుబా నెట్‌ఫ్లిక్స్‌లో

ABN, First Publish Date - 2021-06-04T06:46:30+05:30

తాప్సీ కథానాయికగా నటించిన ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదలకానుంది. ఈ విషయాన్ని తాప్సీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాప్సీ కథానాయికగా నటించిన ‘హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదలకానుంది. ఈ విషయాన్ని తాప్సీ ఇన్‌స్టాలో టీజర్‌ వీడియోను విడుదల చేసి ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌లోనే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. థియేటర్‌ విడుదల కోసం ఇప్పటిదాకా వేచిచూశారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీ విడుదలకు చిత్రబృందం మొగ్గుచూపింది. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్‌ మాసే కథానాయకుడు. హర్షవర్ధన్‌ రాణే కీలకపాత్ర పోషించారు. వినీల్‌ మాథ్యూ దర్శకుడు. 


Updated Date - 2021-06-04T06:46:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!