‘ఆహా’ కోసం సుక్కు వెబ్‌సిరీస్
ABN, First Publish Date - 2021-12-23T20:59:18+05:30
మంచి కంటెంట్ కు, కొత్త టాలెంట్ కు అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. అదే సమయంలో పేరున్న టాలీవుడ్ దర్శకులతో వెబ్ సిరీస్ ను కూడా నిర్మిస్తోంది. సినీయర్ హీరోతో ‘అన్‌స్టాపబుల్’ అనే షోను అన్‌స్టాపబుల్ గా నిర్వహిస్తోన్న ఈ సంస్థ.. వరుస వెబ్ సిరీస్‌ల్ని, చాట్ షోలు చేసి ‘ఆహా’ ను మరింత అభివృద్ధి చేసే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే సుకుమార్ తో ఓ భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందని టాక్. నిజానికి సుకుమార్ ‘పుష్ప’ కన్నా ముందే ఓ వెబ్ సిరీస్ చేయాల్సి ఉంది.
మంచి కంటెంట్ కు, కొత్త టాలెంట్ కు అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. అదే సమయంలో పేరున్న టాలీవుడ్ దర్శకులతో, రైటర్స్ తో వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేస్తోంది. సినీయర్ హీరోతో ‘అన్‌స్టాపబుల్’ అనే షోను అన్‌స్టాపబుల్ గా నిర్వహిస్తోన్న ఈ సంస్థ.. వరుస వెబ్ సిరీస్‌ల్ని, చాట్ షోలు చేసి ‘ఆహా’ ను మరింత అభివృద్ధి చేసే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే సుకుమార్ తో ఓ భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందని టాక్. నిజానికి సుకుమార్ ‘పుష్ప’ కన్నా ముందే ఓ వెబ్ సిరీస్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన స్ర్కిప్ట్ పై సుక్కు మూడు నెలలకు పైగానే శ్రమించాడట. అయితే బడ్జెట్ ఎక్కువవడం వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ను ఆహా వారు ధైర్యంగా పట్టాలెక్కబోతున్నారని సమాచారం. అందుకే ఆ స్ర్కిప్ట్ తో ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అయితే దీనికి సుకుమార్ దర్శకుడు కాదు. కేవలం కథ, స్ర్కీన్ ప్లే, మాటలు అందిస్తాడు. సుకుమార్ రైటింగ్స్, ఆహా కలిసి ఈ వెబ్ సిరిస్ ను నిర్మించబోతున్నారు. ఇది కూడా పుష్ప లాంటి కథే అని తెలుస్తోంది. ఓ జీరో లాంటి వ్యక్తి హీరోగా ఎలా ఎదిగాడు అనేదే కథాంశం. ప్రముఖ కథానాయకుడు ఆ వెబ్ సిరీస్ లో నటించ బోతున్నాడట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.