సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జీ 5 ఓటీటీలో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’.. ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2021-05-08T23:00:25+05:30

‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు సందడి చేస్తున్న ఓటీటీ వేదిక జీ 5లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనుంది. గత ఏడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు సందడి చేస్తున్న ఓటీటీ వేదిక జీ 5లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనుంది. గత ఏడాది ‘అమృతరామమ్’, ‘47 డేస్’, ‘మేక సూరి’ సినిమాలను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ చేసింది జీ 5. ఈ ఏడాది ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమా తర్వాత ‘రూమ్ నంబర్ 54’ వెబ్ సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో ఈ ఏడాది ఒరిజినల్ కంటెంట్ రిలీజ్‌లను జీ5 స్టార్ట్ చేసింది.


అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఈ చిత్రాన్ని మే 14న టెలికాస్ట్ చేయనున్నట్లుగా జీ 2 అధికారికంగా ప్రకటించింది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు తెలిపారు. జీ5తో అసోసియేట్ కావడం, తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని చెప్పారు.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... రామస్వామికి జీవితంలో రెండంటే రెండే లక్ష్యాలు ఉంటాయి. ఒకటి... శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. రెండు... చీరల వ్యాపారం చక్కగా చేసుకోవాలి. కోరుకున్నట్టుగా... వీధుల్లో నగలు అమ్మే జయప్రదను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో ఇద్దరి మెడలో మూడు ముడులు వేస్తాడు. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకోవాలంటే.. ఈ సినిమాని చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.

Updated Date - 2021-05-08T23:00:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!