దర్శకుడు సుందర్‌ సి ‘అరణ్మనై-3’ ఓటీటీలో వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2021-11-09T02:24:50+05:30 IST

ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి తన మార్కు మాయాజాలంతో తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై-3’. ఇటీవల థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుందర్‌ సితో పాటు ఆర్య-రాశీఖన్నా జంటగా

దర్శకుడు సుందర్‌ సి ‘అరణ్మనై-3’ ఓటీటీలో వచ్చేస్తోంది

ప్రముఖ దర్శకుడు సుందర్‌ సి తన మార్కు మాయాజాలంతో తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై-3’. ఇటీవల థియేటర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుందర్‌ సితో పాటు ఆర్య-రాశీఖన్నా జంటగా, వివేక్‌, యోగిబాబు, సాక్షి అగర్వాల్‌ తదిరులు ఇందులో నటించారు. యూకే సెంథిల్‌ కుమార్‌ డీవోపీగా పనిచేయగా.. సత్య ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ‘అరణ్మనై’ సిరీస్‌లో తెరకెక్కిన మరో దెయ్యం కథ ఇది. ఈ చిత్రం జీ-5 ఓటీటీలో నవంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‌ కానుంది. మలేషియా టు అమ్నీషియా, డిక్కిలోనా, వినోదా సిద్ధం వంటి కొత్త చిత్రాల తర్వాత అరణ్మనై-3 చిత్రం జీ-5 ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీని నటి ఖుష్బూ సుందర్‌ సొంతంగా నిర్మించారు.

Updated Date - 2021-11-09T02:24:50+05:30 IST