రేర్ పిక్: పక్కపక్కనే అతిరథ మహారథులు

ABN , First Publish Date - 2021-11-09T03:26:16+05:30 IST

ఒక పక్క ఎన్టీఆర్, మరో పక్క స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు, ఇంకోపక్క దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి. వెనుక వరుసలో నాగార్జునతో పాటు సీనియర్ దర్శకుడు

రేర్ పిక్: పక్కపక్కనే అతిరథ మహారథులు

ఒక పక్క ఎన్టీఆర్, మరో పక్క స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు, ఇంకోపక్క దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి. వెనుక వరుసలో నాగార్జునతో పాటు సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇంతమంది అతిరథ మహారథులను ఒకచోట చూడడం నిజంగా అరుదైన విషయమే. ఎప్పుడో కానీ ఇటువంటి కలయిక జరుగదు. అప్పట్లో మొబైల్ ఫోన్‌లు లేవు కాబట్టిఅంతా ఒకచోట చేరి పిచ్చాపాటిగా సినిమా విషయాలు తీరుబడిగా ముచ్చటించేవారు. ఒకరి సినిమా విశేషాలు మరొకరితో పంచుకునేవారు. 


ఈ బిజీ యాంత్రిక జీవనంలో ఇలా అందరూ ఒకచోట కలుసుకుని, ఆత్మీయంగా ముచ్చటించుకునే సందర్భాలు అరుదైపోయాయి. ఒకవేళ కలుసుకున్నా.. ఆ సమావేశాలు మొక్కుబడిగా ఉంటున్నాయి. ఎవరి బిజీలో వాళ్లుంటున్నారు. 30 ఏళ్ల నాటి ముచ్చటకు సంబంధించిన మధుర జ్ఞాపకం ఇది. దర్శకుడు విక్టరీ మధుసూదనరావుకు హైదరాబాద్‌లోని జింఖానా క్లబ్‌లో సన్మానం జరుగుతుంటే.. ఎన్టీఆర్ సహా ఇలా ప్రముఖులంతా విచ్చేశారు. ఆ సందర్భంగా ఒకచోట చేరి, అందరూ ఆప్యాయంగా ముచ్చటించుకుంటున్నప్పటి దృశ్యమిది. 

Updated Date - 2021-11-09T03:26:16+05:30 IST