సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దివ్యభారతి ‘చింతామణి’.. అలా ఆగిపోయింది

ABN, First Publish Date - 2021-11-22T22:18:44+05:30

‘బొబ్బిలిరాజా’ (1990) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దివ్యభారతి ఆ తర్వాత ఓ రెండేళ్లు ఇండస్ట్రీని ఊపేసింది. తొలి సినిమాతోనే స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకొన్న ఈ గ్లామర్‌ తార.. ఒక్క నాగార్జునతో తప్ప అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఆ రోజుల్లోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బొబ్బిలిరాజా’ (1990) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దివ్యభారతి ఆ తర్వాత ఓ రెండేళ్లు ఇండస్ట్రీని ఊపేసింది. తొలి సినిమాతోనే  స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకొన్న ఈ గ్లామర్‌ తార.. ఒక్క నాగార్జునతో తప్ప అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఆ రోజుల్లోనే రోజుకు లక్ష రూపాయలు పారితోషికం డిమాండ్‌ చేసినా, దివ్యభారతికి ఉన్న క్రేజ్‌ని చూసి నిర్మాతలు కిమ్మనకుండా చెల్లించేవారని చెప్పుకొనేవారు. దివ్యభారతికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గమనించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆమెతో ‘చింతామణి’ చిత్రాన్ని తీయాలని ప్లాన్‌ చేశారు. ‘చింతామణి’ చాలా పాపులర్‌ నాటకం. రంగస్థలం మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం. రెండు సార్లు సినిమాగా కూడా వచ్చింది. ఆ కథ గురించి, చింతామణి పాత్ర గురించి విన్న దివ్యభారతి అందులో నటించాలని ముచ్చటపడింది. 


1992లో ఆమె కథానాయికగా ‘చింతామణి’ షూటింగ్‌ మొదలైంది. అయితే రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా మొదలుపెట్టకముందే దివ్యభారతి ఆకస్మికంగా మరణించడంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. మరణించే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లే. తెలుగు, హిందీ భాషల్లో 20కి పైగా చిత్రాల్లో నటించిన గ్లామర్‌ సంచలనం దివ్యభారతి ఇలా హఠాత్తుగా మరణించడం నిజంగా విషాదకరమే!

-వినాయకరావు

Updated Date - 2021-11-22T22:18:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!