కింగ్ నాగ్ ఎంతో మనసు పెట్టి చేసిన చిత్రమది.. కానీ ప్రేక్షకులకే?

ABN , First Publish Date - 2021-11-17T02:07:57+05:30 IST

నాగార్జున ఈ చిత్రం మీద మొదటి నుంచీ చాలా నమ్మకం పెట్టుకున్నారు. మహేశ్ భట్ చెప్పినట్లు చేశారు. సినిమా కోసం చాలా కాలం గడ్డం పెంచారు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం మరో సినిమా జోలికి పోలేదు.. కానీ?

కింగ్ నాగ్ ఎంతో మనసు పెట్టి చేసిన చిత్రమది.. కానీ ప్రేక్షకులకే?

బాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో చిత్రాలు రూపొందించిన దర్శకుడు మహేశ్ భట్ తెలుగులో చేసిన ఏకైక చిత్రం క్రిమినల్. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా హీరోయిన్లుగా నటించారు. డాక్టర్ అజయ్‌గా నాగార్జున ఈ చిత్రంలో నటించారు. ఫ్యుజిటివ్ ఆంగ్ల చిత్రంలోని కొన్ని సన్నివేశాలు క్రిమినల్‌లో చూడవచ్చు. నాగార్జున ఈ చిత్రం మీద మొదటి నుంచీ చాలా నమ్మకం పెట్టుకున్నారు. మహేశ్ భట్ చెప్పినట్లు చేశారు. సినిమా కోసం చాలా కాలం గడ్డం పెంచారు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం మరో సినిమా జోలికి పోలేదు నాగార్జున. 


అంతే కాదు క్రిమినల్ రీ రికార్డింగ్ సంగీత దర్శకుడు కీరవాణి సారథ్యంలో చెన్నైలో జరుగుతుంటే నాగార్జున కూడా అక్కడకు వెళ్లి స్వయంగా పరిశీలించడం గమనార్హం. సాధారణంగా రీరికార్డింగ్‌కు హీరోలు దూరంగా ఉంటారు. అయితే తనకు బాగా నచ్చిన సినిమా కావడంతో రీ రికార్డింగ్‌కు హాజరయ్యారు నాగార్జున. ఆయన ఇంతగా మనసు పెట్టిన క్రిమినల్ చిత్రం ప్రేక్షకులకు మాత్రం నచ్చలేదు. 

-వినాయకరావు

Updated Date - 2021-11-17T02:07:57+05:30 IST