ఆశ కలిగించారు

ABN , First Publish Date - 2021-08-01T18:35:58+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డిలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో 23 చిత్రాలు రూపుదిద్దుకోవడం నిజంగా ఒక రికార్డే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘ముఠామేస్త్రి. ‘కొండవీటి దొంగ’....

ఆశ కలిగించారు

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డిలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో 23 చిత్రాలు రూపుదిద్దుకోవడం నిజంగా ఒక రికార్డే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘ముఠామేస్త్రి. ‘కొండవీటి దొంగ’ చిత్రం తర్వాత వారిద్దరి సినిమాలు రాకపోవడంతో, ఏదో జరిగిందనీ, విభేదాలు వచ్చి విడిపోయారనీ, వీరిద్దరూ కలవడం ఇక కష్టమనీ వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ నిజం కాదని ‘ముఠామేస్త్రి’ (1993) చిత్రం నిరూపించింది. మార్కెట్‌ యార్డులో కూలీగా పనిచేసే ఓ సామాన్యుడు అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఈ చిత్ర కథాంశం.


చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా.. రారా? అనే చర్చ జరుగుతున్న ఆ రోజుల్లో సినిమా చివర్లో ‘మళ్లీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లితే పిలవండి. స్పీడై పోతా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగును ప్రత్యేకంగా పరుచూరి సోదరులతో రాయించారు కోదండరామిరెడ్డి. ఈ డైలాగ్‌ విన్నాక చిరంజీవి ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తారనే ఆశ ఆయన అభిమానుల్లో కలిగింది.

Updated Date - 2021-08-01T18:35:58+05:30 IST