సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎన్టీఆర్‌ అంటే ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం!

ABN, First Publish Date - 2021-09-14T04:24:27+05:30

నందమూరి తారక రామారావు అంటే నటుడు కాంతారావుకు ఎంతో అభిమానం. ఎన్నో సందర్భాల్లో అద్భుతమైన పాత్రలకు కాంతారావు పేరు రికమండ్‌ చేసి, అవి ఆయనకు వచ్చేలా చేశారు ఎన్టీఆర్‌. ఉదాహరణకు ‘లవకుశ’ చిత్రంలోని లక్ష్మణుడి వేషానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి తారక రామారావు అంటే నటుడు కాంతారావుకు ఎంతో అభిమానం. ఎన్నో సందర్భాల్లో అద్భుతమైన పాత్రలకు కాంతారావు పేరు రికమండ్‌ చేసి, అవి ఆయనకు వచ్చేలా చేశారు ఎన్టీఆర్‌. ఉదాహరణకు ‘లవకుశ’ చిత్రంలోని లక్ష్మణుడి వేషానికి దర్శకనిర్మాతలు వేరే నటుల పేర్లు పరిశీలిస్తుంటే వారు వద్దని, కాంతారావునే తీసుకోండి అని స్ట్రాంగ్‌గా రికమెండ్‌ చేశారు రామారావు. అలాగే వేషాలు లేక, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోజుల్లో దేవుడల్లే ఎన్టీఆర్‌ ఆయన్ని ఆదుకొన్నారు. ‘జయసింహ’ చిత్రంలో తన తమ్ముడి వేషం కాంతారావుకు ఇచ్చారు. మొదట ఈ వేషానికి జగ్గయ్యను అనుకున్నారు. చివరకు కాంతారావును ఆ వేషం వరించింది. ‘జయసింహ’ చిత్రం ఆయనకు తొలి కమర్షియల్‌ బ్రేక్‌ ఇచ్చింది. కాంతారావు జానపదాలకు పనికి వస్తాడని ఈ సినిమాతోనే పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలిసింది. ఇక అప్పటినుంచి జానపద చిత్ర కథానాయకుడిగా వెలిగిపోతూ, ‘కత్తి కాంతారావు’గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఎన్టీఆర్‌ అంటే ఆ కృతజ్ఞతాభావం కాంతారావులో ఎప్పుడూ ఉండేది. 


హీరోగా కాంతారావు శుక్ర దశ అంతా 1960ల దశకంలోనే. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రక చిత్రాలు.. అన్నీ ఆయన దున్నేశారు. మరో విషయం ఏమిటంటే... పాత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే ఎన్టీఆర్‌ చిత్రాల్లో కాంతారావు, ఏయన్నార్‌ చిత్రాల్లో జగ్గయ్య హీరోతో సమాన స్థాయి కలిగిన పాత్రలను పోషించిన వైనం వెల్లడవుతుంది. జగ్గయ్య కంటే కాంతారావు తక్కువ పారితోషికం తీసుకోవడమే దీనికి కారణం అని చెప్పేవారూ ఉన్నారు. ఏదిఏమైనా చిత్ర పరిశ్రమలోకి తను రాకముందు నుంచీ జగ్గయ్య తనకు స్నేహితుడైనా, సినిమాల్లోకి వచ్చాక కాంతారావునే ఎన్టీఆర్‌ ప్రోత్సహించడం గమనార్హం. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా ఏయన్నార్‌ ‘రహస్యం’ చిత్రంలో కాంతారావు నటించడం ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు ఆగ్రహం కలిగించిందని అంటారు. ఈ కారణంగా కొన్ని నెలలు ఆయన్ని దూరం పెట్టారు కూడా.

-వినాయకరావు



Updated Date - 2021-09-14T04:24:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!