సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రత్యర్థి ప్యానల్ డబ్బులు పంచుతుందట: నరేష్

ABN, First Publish Date - 2021-10-10T03:26:52+05:30

‘మా’ ఎన్నికలలో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ ఇస్తున్న ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్.. ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతుందని తనకు తెలిసినట్లుగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మా’ ఎలక్షన్లకు సంబంధించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మా’ ఎన్నికలలో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ ఇస్తున్న ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్.. ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతుందని తనకు తెలిసినట్లుగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మా’ ఎలక్షన్లకు సంబంధించి ఇదే నా చివరి వీడియో అని తెలిపిన నరేష్.. డబ్బులు తీసుకున్నా.. మనస్సాక్షితో మంచు విష్ణుకే ఓటు వేయమని కోరారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే అందిన దుర్వార్త ఏమిటంటే.. ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారు. మనిషిని బట్టి 10 నుంచి 25 వేల వరకు 3,4 సెంటర్స్‌లో ఈ నైట్ డబ్బులు పంచడం స్టార్ట్ చేశారు. అందుకనే మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేయకుండా.. డబ్బు మమ్మల్ని గెలిపిస్తుంది అనే భరోసాతో మెంబర్స్‌ని లోబరచుకుంటున్నారు. నేను ఒకటే చెబుతున్నా.. డబ్బులిస్తే తీసుకోండి. ఎందుకంటే వీళ్ల(విష్ణు) దగ్గర నుండి డబ్బులు రావు. నేను కరోనా టైమ్‌లో డబ్బులు పంచితే.. దానికి చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కోసం డబ్బులు పంచుతున్నారు. డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మీ మనస్సాక్షికి వేయండి. మంచు విష్ణుకే ఓటేయండి. నేను అంతకంటే కోరను. నేను అబద్దాలు ఆడను. ఈ ఎన్నికలకు సంబంధించి ఇదే నా చివరి వీడియో.’’ అని అన్నారు. 

Updated Date - 2021-10-10T03:26:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!