సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇన్‌ఫ్లూయన్సర్‌: 27వ స్థానంలో వెంకటేశ్‌ కుమార్తె!

ABN, First Publish Date - 2021-07-05T04:37:38+05:30

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ గొప్ప ఆదాయ వనరుగా మారింది. ప్రియాంక చోప్రా, విరాట్‌ కోహ్లీ వంటి సెలబ్రిటీలు ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్‌ చేస్తే లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. హాపర్‌ హెచ్‌ క్యూ అనే సంస్థ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయ వివరాలను వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ గొప్ప ఆదాయ వనరుగా మారింది.  ప్రియాంక చోప్రా, విరాట్‌ కోహ్లీ వంటి సెలబ్రిటీలు ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్‌ చేస్తే లక్షల్లో  ఆదాయం పొందుతున్నారు. హాపర్‌ హెచ్‌ క్యూ అనే సంస్థ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో హీరో వెంకటేశ్‌ కుమార్తె ఆశిత్ర ఉండడం విశేషం. హాపర్‌ హెచ్‌ క్యూ జాబితాలో వరల్డ్‌ వైడ్‌గా అశ్రితకు 377వ స్థానం దక్కింది. ఆసియాలో చూేస్త 27వ స్థ్థానంలో ఉంది. ఇన్‌స్టాలో ఆశ్రిత పోస్ట్‌ చేసే ఒక్క పోస్ట్‌కి రూ.29000 లభిస్తాయట. ఆశ్రిత ఇన్‌స్టాలో ఫుడ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌. ఇన్‌ఫినిటీ పప్టార్‌ పేరుతో ఉన్న అకౌంట్‌లో కుకింగ్‌ వీడియోలను ఆమె షేర్‌ చేస్తుంటారు. ఆ ఖాతాలో ఆమెకు 13 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. బిస్కట్లు, కేకులు, స్నాక్స్‌ ఐటమ్స్‌ కొత్త రకాలను ఆశ్రిత పరిచయం చేస్తుంటారు. పెళ్లి అయిన తర్వాతి నుంచి ఆమె బార్సిలోనాలో ఉంటున్నారు. 




Updated Date - 2021-07-05T04:37:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!