‘మా’ వివాదం.. ఎన్నికల అధికారి స్పందన!
ABN , First Publish Date - 2021-10-13T21:57:38+05:30 IST
‘మా’ ఎన్నికలు ముగిసినా వివాదాలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా’ ఎన్నికలు ముగిసినా వివాదాలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. ఎన్నికలు అప్రజాస్వామికంగా జారిగాయన్న మాటల్లో వాస్తవం లేదు. 20 ఏళ్లగా ‘మా’కు లీగల్ అడ్వైజర్‌గా ఉన్నా. పది సార్లు ఎన్నికలు నిర్వహించా. ‘మా’ ఎన్నిలకు ఎలా నిర్వహించాలనే దానిపై నాకు అవగాహన ఉంది. యాంకర్ అనసూయ మెజారిటీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తనతో ఉన్న ముఖ్యమైన పత్రాలతోపాటు బ్యాలెట్ పేపర్ల తాళాలను మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, అవి బ్యాలెట్ పేపర్లు కాదని ఆయన అన్నారు. ‘‘మోహన్‌బాబు సన్నిహితుడే అయినా ఆయనకు ఫేవర్‌గా వ్యవహరించలేదు. కౌంటింగ్ సిబ్బంది అలసిపోయారు. అందుకే మిగిలిన ఓట్లను మరుసటి రోజు లెక్కించి ఫలితాలు వెల్లడించాం. ఎన్నికల్లో ఓడినందుకే ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కృష్ణమోహన్ తెలిపారు.