టాలీవుడ్ టాప్‌స్టార్స్‌.. ట్విట్ట‌ర్ క‌హానీ

ABN , First Publish Date - 2021-05-15T20:27:35+05:30 IST

సోష‌ల్ మీడియాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ట్విట్ట‌ర్‌లో .. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో కొంత‌ మందికి వ‌న్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే ఈ మ్యాజిక్ నెంబ‌ర్ను ఏ స్టార్ ఎన్నిరోజుల్లో రీచ్ అయ్యార‌నే దానిపై చిన్న ఫోక‌స్‌...

టాలీవుడ్ టాప్‌స్టార్స్‌.. ట్విట్ట‌ర్ క‌హానీ

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా మారారు. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిమాన తార‌లు న‌టించిన సినిమాలు, ఇత‌ర‌త్రా విష‌యాల‌ను తెలుసుకోవడానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే  త‌మ‌కు న‌చ్చిన హీరోల‌కు ఫాలోవ‌ర్స్‌గా మారుతున్నారు. ఈ ఫాలోవ‌ర్స్ సంఖ్య స్టార్స్‌కు  మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. హీరో ఇమేజ్ క్యాలిక్యులేష‌న్స్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య కూడా కీల‌కంగా మారడం గ‌మ‌నార్హం. దాన్ని గుర్తించారు క‌నుకే ఓ సోష‌ల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకుని త‌మ ఫాలోవ‌ర్స్‌ను పెంచుకునే ప‌నిలో మ‌న తార‌లున్నారు. సోష‌ల్ మీడియాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ట్విట్ట‌ర్‌లో  .. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో కొంత‌ మందికి వ‌న్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే ఈ మ్యాజిక్ నెంబ‌ర్ను ఏ స్టార్ ఎన్నిరోజుల్లో రీచ్ అయ్యార‌నే దానిపై చిన్న ఫోక‌స్‌... 


మ‌న టాలీవుడ్ అగ్ర క‌థానాయకుల్లో వ‌న్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్న స్టార్స్ ఆరుగురు మాత్ర‌మే. వారే చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ఆరు మందిలో వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను ఎవ‌రు ఎన్ని రోజుల్లో రీచ్ అయ్యార‌నే విష‌యాన్ని చూస్తే...


రామ్‌చ‌ర‌ణ్‌:  మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన రామ్‌చ‌ర‌ణ్ గ‌త ఏడాది మార్చిలోనే ట్విట్ట‌ర్‌లో జాయిన్ అయ్యారు. 233 రోజుల్లోనే వ‌న్ మిలియ‌న్ ట్విట్ట‌ర్ ఫాలో వ‌ర్స్ మార్క్‌ను రీచ్ అయ్యారు. చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో అనుకున్నంత యాక్టివ్‌గా ఉండ‌రు. అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌ను పోస్ట్ చేస్తుంటారు చ‌ర‌ణ్‌. ఈయ‌న‌కు ఇప్ప‌టి దాకా ఉన్న ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ 1.3 మిలియ‌న్. ఇంత‌కీ చ‌ర‌ణ్ ఫాలో అవుతున్న‌దెంత మందినో తెలుసా..ఇద్ద‌రినే. తండ్రి చిరంజీవి, బాబాయ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల‌ను ఫాలో అవుతున్నారు. 


చిరంజీవి:  టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడైన చిరంజీవి ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే గ‌త ఏడాది ఉగాది సంద‌ర్భంగా మార్చి 17న ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గానే చిరంజీవి వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను రీచ్ అయ్యారు. 425 రోజుల్లోనే చిరంజీవి ఈ మ్యాజిక్ నెంబ‌ర్‌ను రీచ్ అయ్యారు. కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ, చిరంజీవి ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాల‌కు సంబంధించిన‌, కొన్ని త‌న పాత‌, కొత్త సినిమాల‌కు సంబంధించిన విషయాల‌ను చిరంజీవి ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ వ‌స్తున్నారు. చిరంజీవి కూడా ఎవ‌రినీ ఫాలో కావ‌డం లేదు. 


అల్లు అర్జున్‌:  మెగా క్యాంప్ నుంచి వ‌చ్చిన హీరోనే అయినా  త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఈయ‌న 2015 ఏప్రిల్‌లో ట్విట్ట‌ర్‌లో జాయిన్ అయితే.. వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను 588 డేస్‌లో రీచ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5.8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నారు. నేటి త‌రం హీరోల్లో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈయ‌న ఎవ‌రినీ ఫాలో కావ‌డం లేదు. 


ప‌వన్‌క‌ళ్యాణ్‌:  చిరంజీవి సోద‌రుడు. జ‌న‌సేన అధినేత‌. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో ప‌వ‌న్ ఒక‌రు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. 2014 ఆగ‌స్ట్‌లో ట్విట్ట‌ర్ ఎంట్రీ ఇచ్చారు. 834 రోజుల్లో ప‌ది ల‌క్షల మంది ఫాలోవ‌ర్స్‌ను సొంతం చేరుకున్న ప‌వ‌న్ 249 మందిని ఫాలో అవుతుండ‌టం విశేషం. 


మ‌హేశ్‌:  కృష్ణ న‌ట వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ అగ్ర క‌థానాయ‌కుడిగా త‌న‌దైన ఇమేజ్‌ను ద‌క్కించుకున్నారు. ఈయ‌న కూడా సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంటారు. 1697 రోజుల్లో వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను రీచ్ అయిన మ‌హేశ్‌2010 ఏప్రిల్‌లో ట్విట్ట‌ర్ మెంబ‌ర్‌గా మారారు. ఇప్ప‌టి వ‌ర‌కు 11.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌తో టాప్‌లో ఉన్నారు. ఈయ‌న 31 మందిని ఫాలో అవుతున్నారు. 


ఎన్టీఆర్‌: ఈ నంద‌మూరి న‌ట వార‌సుడు సోష‌ల్ మీడియాలో అవ‌స‌ర‌మైనప్పుడు త‌ప్ప స్పందించ‌రు. సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను త‌క్కువ‌గా ప్ర‌స్తావిస్తుంటారు. త‌మ పిల్ల‌లకు సంబంధించిన విషయాల‌ను ఎన్టీఆర్ ఎక్కువ‌గా పోస్ట్ చేస్తుంటారు. ట్విట్ట‌ర్‌లో 2837 రోజుల్లో వ‌న్ మిలియ‌న్ మార్క్‌ను అందుకున్నారు. సెప్టెంబ‌ర్ 2009లో ట్విట్ట‌ర్‌లో జాయిన్ అయిన తార‌క్‌కు ట్విట్ట‌ర్‌లో 4.9 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళిని మాత్ర‌మే తార‌క్ ఫాలో అవుతున్నారు. 

Updated Date - 2021-05-15T20:27:35+05:30 IST