వెండితెర కళకళలాడేనా?
ABN , First Publish Date - 2021-06-20T02:18:12+05:30 IST
కోవిడ్, లాక్‌డౌన్ వల్ల మూతపడిన థియేటర్లు ఆదివారం నుంచీ తెరుచుకోనున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు, మాల్స్ ఓపెన్ కానున్నాయి.
కోవిడ్, లాక్‌డౌన్ వల్ల మూతపడిన థియేటర్లు ఆదివారం నుంచీ తెరుచుకోనున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తి వేయాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనితో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు, మాల్స్ ఓపెన్ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో తెరచుకోవచ్చని ప్రభుత్వం నిర్మాతలకు, థియేటర్లు యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వెండితెర కళకళలాడబోతుందని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ఎన్నో చిత్రాలు ఓటీటీ బాటపట్టాయి. ఇప్పుడు సినిమా హాళ్లు తెరచుకుంటున్నాయనే శుభవార్త యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఆనందం నింపింది. ఇప్పటికే కాపీ రెడీ అయ్యి విడుదల తేదీ ప్రకటించిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తి వేయడంతో చిన్నా, పెద్ద చిత్రాలన్నీ విడుదలకు క్యూ కట్టనున్నాయి. ఈ జాబితాలో ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’, ‘ఆచార్య’, ‘నారప్ప’. ‘ఖిలాడి’, ‘పాగల్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. నిర్మాతల సానుకూలతను బట్టి ఏ సినిమా ముందు, ఏది వెనుక అనేది ప్లాన్ చేసుకోవలసి ఉంది.
ఆంధ్రాలో పరిస్థితి ఏంటి?
ఒకవేళ సినిమాలన్నీ వరుస కట్టిన ఆంధ్రప్రదేశ్ విడుదల పరిస్థితి ఏంటన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అక్కడ కూడా లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలులో ఉంది. అక్కడి థియేటర్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలీదు. తెలంగాణాలో థియేటర్లు తెరచుకుని, ఏపీలో మూతపడి ఉంటే నిర్మాతలు సినిమాలు విడుదల చేయడానికి ముందుకురారు. రెండు చోట్ల వ్యాపారం జరిగితే నిర్మాతకు ఆదాయం ఉంటుంది. అయితే దీనిపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.