సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రీకాంత్‌: అన్ని విమర్శలు తర్వాత కలిసి పనిచేయగలమా

ABN, First Publish Date - 2021-10-12T23:24:17+05:30

‘‘మాకు పదవులు అవసరం లేదు. అయినా తమ్ముడులాంటి విష్ణుకు సపోర్ట్‌గా ఉంటాం. ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం’’ అని శ్రీకాంత్‌ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఇరు ప్యానళ్ల నుంచి సగం సగం సభ్యులు గెలిస్తే కుదరదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మాకు పదవులు అవసరం లేదు. అయినా తమ్ముడులాంటి విష్ణుకు సపోర్ట్‌గా ఉంటాం. ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం’’ అని శ్రీకాంత్‌ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఇరు ప్యానళ్ల నుంచి సగం సగం సభ్యులు గెలిస్తే కుదరదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్ని విమర్శలు చేసుకున్నాక కలిసి పనిచేయగలమా అనిపించింది. మా ప్యానల్‌ సభ్యులు నిన్నే రాజీనామా చేస్తామని అన్నారు. అయితే సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు చాలా వివాదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తి చూపినా ‘మమ్మల్ని పనిచేయనీయడం లేదు’ అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. ఆ ప్యానల్‌కు అన్ని తానే అయ్యి నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలు నడిపించారు.  తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉండి మేము ఏదైనా అంటే మళ్లీ వివాదాలు ముదిరిపోతాయి. మా ప్యానల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యం ఉన్నవారు.  మేం వెళ్లి ప్రశ్నిేస్త మళ్లీ గొడవలు మొదలవుతాయి. నరేశ్‌ నన్ను ఎన్నో మాటలు అన్నాడు అయినా భరించారు’’ అని శ్రీకాంత్‌ అన్నారు. 


Updated Date - 2021-10-12T23:24:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!