ఒకే ఒక్క అబద్ధం చెప్పా: శివారెడ్డి

ABN , First Publish Date - 2021-10-13T00:30:37+05:30 IST

నేను అబద్దాలు మాట్లాడే వ్యక్తిని కాను.. కానీ ఒకే ఒక్క అబద్ధం మొన్న ఎన్నికలు రోజు చెప్పాను.. అన్నారు నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. తాజాగా ‘మా’ ఎన్నికలలో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులంతా మీడియా సమావేశాన్ని

ఒకే ఒక్క అబద్ధం చెప్పా: శివారెడ్డి

నేను అబద్దాలు మాట్లాడే వ్యక్తిని కాను.. కానీ ఒకే ఒక్క అబద్ధం మొన్న ఎన్నికలు రోజు చెప్పాను.. అన్నారు నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. తాజాగా ‘మా’ ఎన్నికలలో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులంతా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివారం జరిగిన ఎన్నికలలో ఎటువంటి వాతావరణం నెలకొందో తెలిపే ప్రయత్నం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ..  


‘‘నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్. నేను అసలు పోటీలకు పోను. మిమిక్రీ కాంపిటేషన్స్‌కు కూడా నేనెప్పుడూ పోలేదు. నేను గెలిచినా, ఓడిపోయినా ఒకేలా తీసుకుంటాను. ఆ మెజారిటీ ఓట్లు చూసిన తర్వాత.. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారా? అని ఎంతో సంతోషం వేసింది. నేను మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ ఇంత ఘనంగా ఓట్లేసి నన్ను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను. అందరికీ మా ప్యానల్ తరపున, నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు. నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి.. నాకు ఓటేసిన వారు, వేయని వారు నిరాశ పడవద్దు. నేను 24 గంటలు అందుబాటులో ఉంటా. నేను అబద్దాలు మాట్లాడే వ్యక్తిని కాను.. కానీ ఒకే ఒక్క అబద్ధం మొన్న ఎన్నికలు రోజు చెప్పాను. లోపల అంత రచ్చ జరుగుతున్నా.. బయటికి వచ్చి ఏం గొడవలు జరగట్లేదు అని అబద్దం చెప్పా. కానీ ఆ గొడవలు చూసిన తర్వాత నాకు అనిపించింది.. ఏంటి ఇట్లా ఉంటుందా? అసలు ఎక్కడికి పోతున్నాం. ఇలా ఉంటుందా కథ. ఇంత దారుణంగానా?.. అని అనుకున్నా. చాలా డిజప్పాయింట్ అయ్యా. ఏది ఏమైనా నన్ను మెజారిటీతో గెలిపించిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గెలిచిన ప్యానల్‌లో ఉన్నా, లేకున్నా.. మా ప్యానల్ తరపున అందరికీ అందుబాటులో ఉంటాం. గత నరేష్‌గారి టైమ్‌లో వాళ్లు అడ్డుపడ్డారు, వీళ్లు అడ్డుపడ్డారు అనే సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో వారి టీమ్ ఉంటే ‘మా’ అభివృద్ధి జరుగుతుందని, అడ్డుపడే వారు కూడా ఎవరు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది..’’ అని అన్నారు.

Updated Date - 2021-10-13T00:30:37+05:30 IST