మళ్లీ MAA లో వివాదం.. సీసీ ఫుటేజీ కావాలంటున్న ప్రకాష్‌రాజ్
ABN , First Publish Date - 2021-10-18T15:07:59+05:30 IST
'మా' ఎన్నికల సీసీ ఫుటేజీ అందించాలంటూ ఎన్నికల అధికారిని ప్రకాష్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు ప్రకాష్‌రాజ్.

'మా' ఎన్నికల సీసీ ఫుటేజీ అందించాలంటూ ఎన్నికల అధికారిని ప్రకాష్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు ప్రకాష్‌రాజ్. సీసీ ఫుటేజీ కావాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ చేశారు. అయితే ఇరువురి సమక్షంలో మాత్రమే సీసీ ఫుటేజీ సేకరిస్తామని పోలీసులు తెలిపారు. అంతేకాదు సీసీ ఫుటేజీని ప్రిజర్వ్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇటీవలే మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికలు పూర్తయి మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలు ముగిసినా కూడా ప్రకాష్ రాజ్ వర్గం పోరు కొనసాగిస్తోంది. 'మా' పోలింగ్ రోజు మోహన్‌బాబు, నరేష్ సహా మరికొందరు తమపై దాడి చేశారని ప్రకాష్‌రాజ్ మాట్లాడారు. అంతేకాదు ఈ దాడికి సంబందించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయంటూ ప్రకాష్‌రాజ్ బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలరోజు సీసీ ఫుటేజీ అందించాలంటూ అధికారిని ప్రకాష్‌రాజ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ఇందుకు నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.