తెగేదాకా లాక్కండి: ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2021-08-05T04:29:47+05:30 IST

మరి దీనిని దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేశారో.. లేక వేరే ఏదైనా విషయంపై ట్వీట్ చేశారో తెలియదు కానీ.. ‘తెగేదాకా లాక్కండి’ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. తెలుగులో ట్వీట్ చేశారు కాబట్టి కచ్చితంగా

తెగేదాకా లాక్కండి: ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్

‘మా’ ఎన్నికల వ్యవహారం మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్న విషయం తెలియంది కాదు. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం 5గురు బరిలో ఉన్నారు. ఇంకా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. బరిలో దిగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనేలా పోటీలో ఉన్న 5గురు స్టేట్‌మెంట్స్ ఇచ్చేశారు. అయితే వారిలో ముగ్గురు ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌ల మధ్య మాత్రం ఇన్ డైరెక్ట్‌గా వార్ నడుస్తుందనేది వారి చర్యల ద్వారా తెలుస్తూనే ఉంది.


ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ.. పెద్దలందరూ ఏకగ్రీవం అని నిర్ణయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. పెద్దల మాట గౌరవిస్తానని అన్నారు. ఒకవేళ పోటీ తప్పని పరిస్థితుల్లో కచ్చితంగా బరిలో ఉంటానని తన సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చేశారు. ఇక ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడైన నరేష్ కూడా ఈసారి ఎన్నికలలో తనది శ్రీకృష్ణుని పాత్ర అంటూనే.. ఇన్ డైరెక్ట్‌గా ఆయన సపోర్ట్ ఎవరికి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రీసెంట్‌గా జరిగిన ఈసీ సమావేశంలో ప్రస్తుత నరేష్ ‘మా’ బాడీకి చట్టబద్దత ఉన్నట్లేనని, ఎన్నికలు జరిగే వరకు గరిష్టంగా 6 సంవత్సరాల వరకు ఆ బాడీకే అధికారం ఉంటుందని న్యాయనిపుణులు తేల్చారు. ఈ మీటింగ్ తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయో జరగవో అనేలా సందిగ్ధ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లుగా కథనాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ లేదంటే వచ్చే మార్చికి ‘మా’ ఎన్నికలు అన్నట్లుగా అప్పుడే వార్తలు దర్శనమిస్తున్నాయి కూడా. 


మరి దీనిని దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేశారో.. లేక వేరే ఏదైనా విషయంపై ట్వీట్ చేశారో తెలియదు కానీ.. ‘తెగేదాకా లాక్కండి’ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అవుతోంది. తెలుగులో ట్వీట్ చేశారు కాబట్టి కచ్చితంగా ఇది ‘మా’ ఎన్నికలకు సంబంధించినదే అని నెటిజన్లు కూడా ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుత ‘మా’ కార్యవర్గాన్ని ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారనేలా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 



Updated Date - 2021-08-05T04:29:47+05:30 IST